: ఘనంగా 'రక్షాబంధన్'


రక్షాబంధన్ పండుగను జంటనగరాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తమ సోదరులకు రాఖీలను కట్టేందుకు అక్క చెల్లెళ్ళు తాపత్రయపడ్డారు. సోదరుడి అండ కోరుతూ బంధనాన్ని వేసే ఈ పండుగకు విశేషమైన ఆదరణ ఉంది. దీని కారణంగా ప్రజల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేందుకు పలు కూడళ్లలో రాఖీ షాపులు వెలిశాయి. అందమైన రాఖీలు కొనేందుకు మహిళలు ఉత్సాహం చూపారు. రహదారుల పక్కన ఏర్పాటు చేసిన దుకాణాల్లో రద్దీ నెలకొనడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ స్థంభించింది. కుటుంబాలు చిన్నవైన నేపథ్యంలో రక్త సంబంధాన్ని నిలుపుకునే పండుగగా రాఖీకి ప్రత్యేకత ఉంది. దీంతో దూరాభారాన్ని లెక్కచేయక సోదరులకు రాఖీలు కట్టేందుకు సోదరీమణులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో రాఖీ దుకాణాలకు, మిఠాయి దుకాణాలకు తాకిడి బాగా పెరిగింది.

  • Loading...

More Telugu News