: అవనిగడ్డ ఉపఎన్నికలో కొనసాగుతున్న పోలింగ్
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 241 కేంద్రాల్లో ఈ పోలింగు జరుగుతోంది. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో లక్షా 88వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టీడీపీ తరపున అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిప్రసాద్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎమ్, లోక్ సత్తా పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నా స్వతంత్ర అభ్యర్ధులు బరిలో నిలవడంతో పోలింగ్ తప్పనిసరి అయింది.