: హైటెక్స్ లో అంగరంగవైభవంగా బాలకృష్ణ కుమార్తె వివాహం
ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని, శ్రీభరత్ ల వివాహవేడుక హైటెక్స్ లో అంగరంగవైభవంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,ఆయన కుమారుడు లోకేష్, పురందేశ్వరి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, గీతం విద్యాసంస్థల అధినేత ఎం.వి.వి.ఎస్ మూర్తి హైటెక్స్ కు చేరుకున్నారు. వివిధరంగాలకు చెందిన ప్రముఖుల రాకతో హైటెక్స్ లో సందడి నెలకొంది. పెళ్లికుమారుడు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, గీతం విద్యాసంస్థల అధినేత మూర్తిలకు మనవడు అవుతారు.