: బరువు తగ్గితే బంగారం మీదే!


అదేంటి మనం బరువు తగ్గాలని అనుకుంటాం... అయితే మనం బరువు తగ్గితే బంగారం ఇస్తామంటున్నారేంటి? అని ఆశ్యర్యపడుతున్నారా...! అయినా నిజంగానే బరువు తగ్గిన వారికి బంగారాన్ని బహుమతిగా ఇస్తామంటున్నారు... అది కూడా ప్రభుత్వం వారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించడానికిగాను ఆ దేశ ప్రభుత్వం ఇలాంటి నజరానాలను ప్రకటించి, ప్రజలు బరువు తగ్గే దిశగా వారిని ప్రోత్సహిస్తోంది.

దుబాయ్‌ దేశంలో స్థూలకాయుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. దీంతో ఆదేశ మున్సిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌ హుస్సేన్‌ నాసర్‌ ఒక ప్రకటన చేశారు. అదేమంటే 'బరువు తగ్గండి... బంగారం బహుమతిగా పొందండి' అని. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలంటే మితమైన బరువుండాలి. స్థూలకాయులు పలు అనారోగ్యాల పాలవుతుంటారు. అందుకే దుబాయ్‌ ప్రభుత్వం వారు బరువు తగ్గు... బంగారం గెలుచుకో అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎవరైనా రెండు కిలోల బరువు తగ్గితే వారికి రెండు గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇస్తారట. అంతేకాదు... బాగా బరువు తగ్గిన వారందరిలోంచి లాటరీ ద్వారా ముగ్గురిని ఎంపిక చేసి, వారికి ఒక్కొక్కరికి 3.3 లక్షల విలువచేసే బంగారపు నాణేన్ని బహుమతిగా ఇస్తారట. ఈ పోటీలో పాల్గొనడానికి పోటీలుపడి ప్రజలు తమ పేర్లను రిజిస్టరు చేసుకుంటున్నారట.

  • Loading...

More Telugu News