: నా సోదరే నా బలం: హృతిక్ రోషన్


తన సోదరే తన బలమని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తెలిపారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తన సోదరి నిజమైన సూపర్ స్టార్ అని పేర్కొన్నాడు. జీవితంతో, క్యాన్సర్ తో పోరాడి తనకు స్ఫూర్తిగా నిలిచిన తన సోదరే తన రియల్ హీరో అన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా తన సోదరి చూపించే ప్రేమకు ముగ్థుడినవుతానని తెలిపాడు. నా కోసం ఏం చేయడానికైనా వెనుకాడని తన సోదరి అంటే తనకు తగని మక్కువ అన్నాడు. తన తండ్రికి చెప్పడానికి సంకోచించే విషయాలను కూడా తన సోదరితోనే పంచుకుంటానని చెబుతున్నాడు. అలాగని తాను తప్పు చేస్తే సూటిగా చెబుతుందని అదే తనను ఇంతవాడ్ని చేసిందని తన సోదరికి కృతజ్ఞత చెబుతున్నాడు. అలాంటి సోదరికి రాఖీ ఒక్క రోజే సరిపోదని, అయినా సరే రాఖీ ప్రత్యేకమైనదేనని ఈ హీరో అంటున్నాడు.

  • Loading...

More Telugu News