: మొయిలీని కలిసిన విజయశాంతి.. రేణుకాచౌదరి మధ్యవర్తిత్వం!
మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత ఆమె తరచూ కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయిన రాములమ్మ.. సాయంత్రం వీరప్ప మొయిలీని కలిశారు. ఆమె వెంట టీఆర్ఎస్ వేటుకు గురైన రఘునందన్ కూడా ఉన్నారు. విజయశాంతి ఇటీవలే సోనియాను కలిసి మెదక్ సీటుపై చర్చించిన సంగతి తెలిసిందే. కాగా, విజయశాంతికి కాంగ్రెస్ కండువా అందించేందుకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన వంతు కృషి చేస్తున్నట్టు సమాచారం.