: ఉత్తర భారతంలో భారీ వర్షాలు.. గంగా పరివాహక ప్రాంతంలో రెడ్ అలెర్ట్


ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్ లోని 50 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా, జమ్మూ కాశ్మీర్ లో కొండ చరియలు విరిగిపడడంతో రహదారులు మూసుకుపోయి రాకపోకలు స్థంభించిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లో నదులు ఉప్పొంగుతుండడంతో గంగానదీ పరీవాహక ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అధికారులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

  • Loading...

More Telugu News