: వైజాగ్ విమానాశ్రయంలో కేజీన్నర బంగారంతో దొరికిపోయారు
దుబాయ్ నుంచి కేజీన్నర బంగారం తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు. సిబ్బంది కళ్లుగప్పి దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఒకటిన్నర కిలోల బంగారాన్ని విశాఖపట్నం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు.