: 'ఎంసెట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి ఎక్కడైనా హాజరు కావచ్చు'
సీమాంధ్ర జిల్లాల్లో 16 కేంద్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ రెండోరోజు కూడా జరగలేదని ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంపు అధికారి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు సోమవారం హాజరుకాలేని వారు ఏ కేంద్రంలోనైనా కౌన్సెలింగ్ కు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాకే సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని, విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆప్షన్ల ఎంపిక తేదీల ఖరారులో మార్పులు ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.