: ధర్మానకు మరోసారి సీబీఐ నోటీసులు
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ మరోమారు నోటీసులు పంపింది. లేపాక్షి భూ కేటాయింపు వ్యవహారంలో తమ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మానకు నాంపల్లి సీబీఐ కోర్టులో ఊరట కలిగిన సంగతి తెలిసిందే. ధర్మానను కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ మెమోను న్యాయస్థానం తిరస్కరించింది.