: మోడీకి రాఖీ కట్టిన పలువురు మహిళలు
'రక్షా బంధన్' పురస్కరించుకుని పలువురు మహిళలు, బాలికలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి రాఖీ కట్టారు. వారిలో వివిధ మతాలకు చెందిన మహిళలు ఉన్నారు. అందమైన రాఖీలను మోడీ చేతికి కట్టి ఆశ్వీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. దేశ సరిహద్దులో చైనా, పాకిస్తాన్ చేస్తున్న దాడుల నుంచి సైనికులకే రక్షణ లేకపోతే దేశాన్నెవరు రక్షిస్తారని అన్నారు. తప్పకుండా భారతావని భద్రతను కాపాడుకోవాలన్నారు.