: విడాకులుపై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసిన సుప్రీం కోర్టు


మహిళ ఉద్యోగం చేస్తూ సంపాదించుకంటున్న కారణంగా ఆమె విజ్ఞప్తిని తిరస్కరించడం తగదని, ఈ తీర్పు వల్ల కలిగే ప్రభావాలను సింగిల్ జడ్జి విస్మరించరాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టు గతంలో ఆమె కేసును బదిలీకి ఒప్పుకోకుండా ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసి ఆమె కేసును కాకినాడ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన మహిళ, తన భర్త దాఖలు చేసిన విడాకుల పిటీషన్ విచారణను కాకినాడ కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కానీ ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో సెక్రటరీగా పని చేస్తున్నందు వల్ల ఆమె తల్లిదండ్రుల మీద ఆధారపడిన మహిళ కాదని, అందువల్ల పిటీషన్ విచారణ బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెబుతూ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది.

ఈ సందర్భంగా విడాకుల పిటీషన్ విచారణ బదిలీ చేసే విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. మహిళకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన విడాకుల పిటీషన్ విచారణను ఆమెకు సమీపంలోని కోర్టుకు బదలాయించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చక్కర్లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పును అన్యాయంగాను, తెలివితక్కువదిగాను అభివర్ణించిన జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News