: సమైక్య ఉద్యమంలో రేపటి నుంచి ఉపాధ్యాయులు
సమైక్యాంధ్ర ఉద్యమానికి సీమాంధ్ర ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఈమేరకు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చింది. రేపు అర్ధరాత్రి నుంచి తమ ఉద్యమం మొదలవుతుందని తెలిపారు. సీమాంధ్రలోని రెండు లక్షల 50వేల మంది ఉపాధ్యాయులు ఉద్యమంలో పాల్గొనబోతున్నారు.