: పాపం.. సిమ్లా యాపిల్


చైనా చౌక మంత్రం దెబ్బకు ఇప్పటికే భారతీయ మార్కెట్ విలవిలలాడుతోంది. అన్ని రకాల వస్తువులను చౌకగా తయారు చేసి ప్రపంచ మార్కెట్లలో కుమ్మరించడమే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్న అతిపెద్ద బలం. ఇన్నాళ్లూ బొమ్మలు, ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్, ఎలక్ట్రిక్, ప్లాస్టిక్ వస్తువులకే పరిమితమైన చైనా ఇప్పుడు యాపిల్స్ ను కూడా భారత మార్కెట్లలోకి వదిలి ఇక్కడి యాపిల్ మార్కెట్ పై పంజా విసురుతోంది.

చైనా, న్యూజిలాండ్ యాపిల్ పండ్ల నుంచి హిమాచల్ యాపిల్ పండ్లకు తీవ్ర పోటీ ఎదురవుతోందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అన్నారు. చైనా, న్యూజిలాండ్ సహా ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న పండ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోందని చెప్పారు. 'యాపిల్-స్థిరమైన అభివృద్ధి' అనే ప్రాజెక్టును సిమ్లా, కులు, కిన్నౌర్ జిల్లాలలో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. యాపిల్ పండ్ల పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News