: రాజీవ్ గాంధీ హంతకులను ఉరి తీయవద్దు: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను ఉరితీయవద్దని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కే.టి. థామస్ ప్రభుత్వాన్నికోరారు. 1999లో రాజీవ్  హంతకులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన ధర్మాసనంలో కేటి థామస్ ఒకరు.

ఈ కేసులో నేరస్తులయిన మురుగన్, శాంతన్, పెరారివాలన్ లు ప్రస్తుతం తమిళనాడులోని వెల్లూరు జైలులో ఉన్నారు. ఇప్పటికే వీరు 22 సంవత్సరాల జైలుశిక్ష అనుభవించారని థామస్ అన్నారు. 

ఇన్నేళ్ల తర్వాత రాజీవ్ హంతకులకు మరణశిక్ష అమలు చేస్తే ఒకే నేరంలో రెండుసార్లు శిక్షించినట్లు అవుతుందని థామస్ అభిప్రాయపడ్డారు. ఇలా శిక్షించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ మాజీ న్యాయమూర్తి.. కేరళలోని కొట్టాయంలో ఆదివారం విలేకరులతో అన్నారుఇప్పటికే ఈ ముగ్గురూ.. జీవితకాల శిక్ష కంటే ఎక్కువగానే శిక్షను అనుభవించారని ఆయన అన్నారు. 

కనుక వీరి క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని థామస్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసులో మరో నేరస్తురాలు నళిని ఉరిశిక్షను జీవితకాలపు శిక్షగా మారుస్తూ మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమోదం తెలిపారు. 

  • Loading...

More Telugu News