: దిగ్విజయ్ ను కలిసిన విజయశాంతి


టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ గూటికి చేరేందుకు చకచకా పావులు కదులుతున్నాయి. ఈ మేరకు ఆమె నిన్న సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. గతనెల చివరిలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన రాములమ్మకు మెదక్ ఎంపీ సీటే ఇస్తామని సూచనప్రాయంగా చెప్పడంతో ఇప్పుడు దిగ్విజయ్ ను కలిశారు. ఈ భేటీతో ఆమె కాంగ్రెస్ లో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఆమెతో పాటు టీఆర్ఎస్ మాజీ నేత రఘునందన్ కూడా డిగ్గీని కలిశారు.

  • Loading...

More Telugu News