: ఉద్యోగులు ప్రజల సేవకులు, సమ్మె సరికాదు: జేపీ


రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. హైదరాబాదులో పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులు ప్రజా సేవకులని, జీతాలు, సర్వీసులు, పెన్షన్ల కోసం ఉద్యమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లభించడాన్ని ప్రభుత్వోద్యోగులు గర్వకారణంగా భావించాలని జేపీ అన్నారు. సామాన్యుడికి సేవ చేసే అవకాశం వారికే ఉందన్నారు. ఉద్యోగులు సమ్మెలోకి దిగడాన్ని ఆయన తప్పుబట్టారు.

సమాజంలో మిగిలిన వారితో పోల్చితే ఉద్యోగులకు ప్రత్యేక స్థానముందని చెప్పారు. ఇక, ఎంసెట్ కౌన్సెలింగ్ కు ఉద్యమకారులు అడ్డుపడరాదని జేపీ సూచించారు. ఏ ప్రాంతం కోసం ఉద్యమం చేస్తున్నారో ఆ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలో పడేయొద్దని వారికి హితవు పలికారు. పౌర సమాజాన్ని రకరకాలుగా హింసిస్తే అది ఉద్యమం అనిపించుకోదన్నారు.

  • Loading...

More Telugu News