: ఢిల్లీకి ప్రయాణమైన సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలో రాజీవ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం సీఎం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిపోయారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం ఢిల్లీకి వెళ్లడం ఇదే మొదటిసారి. తన పర్యటనలో పార్టీ ముఖ్యనేతలతో సీఎం సమావేశమవుతారు. విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సీఎం వారికి వివరించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News