: భర్త అదృశ్యమైన 18 ఏళ్ళకు ఫిర్యాదు చేసిన మహిళ


పోలీసు స్టేషన్ గడప తొక్కేందుకు భయపడిన ఓ ఇల్లాలు తన భర్త అదృశ్యమైన 18 ఏళ్ళకు ఫిర్యాదు చేసిన ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. గుజరాత్ లోని వల్సాద్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకెళితే మంజు పర్మార్ (50) అనే మహిళ భర్త జనక్ సింహ్ పర్మార్ 1995లో కనిపించకుండా పోయాడు. అయితే, అప్పట్లో ఫిర్యాదు చేయడానికి మంజు ఎంతో భయపడింది. పోలీస్ స్టేషన్ కు వెళితే ఏదో జరుగుతుందన్న భయంతో ఆమె కేసు దాఖలు చేసేందుకు వెనుకంజ వేసింది. బంధువులూ ఆమెను మరింత ఒత్తిడిలోకి నెట్టారు. పోలీసు శైలి ఘనకార్యాల గురించి చిలువలుపలువలుగా చెప్పేసరికి ఆమెకు వణుకుపుట్టింది. భర్త పోతే పోయాడనుకుని కిమ్మనకుండా ఉండిపోయింది.

అయితే, ఇటీవలే కొన్ని ఆస్తులు అమ్మాల్సి వచ్చేసరికి ఇబ్బంది వచ్చి పడింది. అవి మంజు భర్త పేరిట ఉండడంతో వారి లాయర్ మిస్సింగ్ కేసు పెడితే విక్రయలావాదేవీ సులభతరం అవుతుందని సూచించాడట. దీంతో, ఆవిడ 'నా భర్త కనిపించడంలేదండీ' అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News