: బొత్స ఇంటి ముట్టడికి 'తెలుగు మహిళ'ల యత్నం
విజయనగరంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి టీడీపీ మహిళా కార్యకర్తలు ప్రయత్నించారు. ర్యాలీగా మహిళలంతా బొత్స ఇల్లు చేరుకునేందుకు ఉద్యుక్తులయ్యారు. దీంతో పోలీసులు వీరిని కోరాడ వీధి ప్రవేశం వద్ద అటకాయించారు. దీంతో మహిళలు అక్కడే బైఠాయించి తమను అనుమతించాలని డిమాండ్ చేశారు. ముందుకు వెళ్ళేందుకు అనుమతించకపోవడంతో వారికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.