: బావతో కలిసి చెప్పులు విసిరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా?: హరికృష్ణకు హరీశ్ ప్రశ్న
టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ప్రజలకు రాసిన బహిరంగ లేఖపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రాష్ట్ర విభజన జరిగితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందంటున్న హరికృష్ణ.. బావ చంద్రబాబుతో కలిసి చెప్పులు విసిరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? అని ప్రశ్నించారు. లేఖపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని అన్నారు. ఇక విభజన ప్రకటన అనంతరం రాష్ట్రంలోని పార్టీలు ఊసరవెల్లుల్లా రంగులు మారుస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నారని ఆరోపించారు.