: బీమా భవన్ లో మార్మోగిన 'సమైక్యమే ముద్దు.. విభజన వద్దు'


'సమైక్యమే ముద్దు, విభజన వద్దు' అనే నినాదాలతో బీమా భవన్ మార్మోగిపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ బీమా భవన్ ఉద్యోగులు నేడు విధులు బహిష్కరించారు. విభజిస్తే సీమాంధ్ర జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. వీరికి ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు సత్యనారాయణ, మరికొందరు ప్రతినిధులు మద్దతు తెలిపారు. రాష్ట్రం విడిపోతే లాభమేంటి? నష్టమెంత? అనే అంశాలను వారు వివరించారు. ఉద్యమానికి మద్దతుగా అన్ని శాఖలకు చెందిన సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News