: పాక్ సైన్యం ప్రమేయం లేకుండా ఏమీ జరగదు: ఆంటోనీ
సరిహద్దుల్లో ఇటీవలే పాకిస్తాన్ బలగాలు పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం పట్ల రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో మాట్లాడారు. నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం సహకారం లేకుండా ఎలాంటి ఘటనలు జరగవని స్పష్టం చేశారు. సరిహద్దుల వెంబడి భారత జవాన్లపై కాల్పుల్లో పాక్ ప్రత్యేక దళాల పాత్ర ఉందని ఆయన తెలిపారు. దాయాది కవ్వింపు చర్యలు కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఇక, ఇటీవల 18 మంది నేవీ సిబ్బంది గల్లంతవడానికి కారణమైన ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంపై సభలో ప్రకటన చేస్తూ, అంతర్గత సాంకేతిక సమస్యలతోనే సబ్ మెరైన్లో పేలుళ్ళు జరిగాయని వివరించారు.