: తెలంగాణ ఉద్యోగులకో న్యాయం, మాకో న్యాయమా?: సీమాంధ్ర ఉద్యోగులు
తెలంగాణ ఉద్యోగులకో న్యాయం, మాకో న్యాయమా..? అంటూ పోలీసుల్ని సీమాంధ్ర ఉద్యోగులు నిలదీశారు. హైదరాబాద్ లోని విద్యుత్ సౌధలో నిరసనలు వ్యక్తం చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీమాంధ్ర నేతలను అడ్డుకుని కేటీఆర్ ను అనుమతించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి పరకాల ప్రభాకర్ సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ సౌధలోకి రాజకీయనేతల్ని అనుమతించడంపై తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన నిరసన వ్యక్తం చేయగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీమాంధ్ర ఉద్యోగులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.