: ఆపిల్ ఐపాడ్ కు పోటీగా సాంసంగ్ కొత్త టాబ్లెట్!
అరచేతిలో ప్రపంచం ఇమిడి పోతున్న రోజులివి.. ఏ సమయంలో అయినా.. ఎక్కడ ఉన్నా..ప్రపంచాన్ని చేతిలోనే చూస్తోంది నేటి తరం.. సెల్ నుంచి ఐపాడ్..టాబ్లెట్ ల వరకు మారిన సాంకేతిక ప్రగతి కంప్యూటర్లకు చెక్ పెడుతోంది. వినియోగదారులని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తున్న ఆపిల్ ఉత్పత్తులకు సాంసంగ్ తాజాగా పోటీ ఇస్తోంది.
ఆపిల్ ఐపాడ్ కు పోటీగా సాంసంగ్ గెలాక్సీ నోట్ 8.0 టాబ్లెట్ ను రంగంలోకి దింపుతోంది. కేవలం 7.9 అంగుళాల స్క్రీన్, స్క్రీన్ పెన్ కలిగిన ఈ సరికొత్త టాబ్లెట్.. ఆపిల్ ఐపాడ్ మినీకి పోటీగా, వినియోగదారులని ఆకర్షిస్తుందని సాంసంగ్ ధీమాగా ఉంది.
అలాగే తన ఉత్పత్తులు సాంసంగ్ గెలాక్సీ నోట్ 2 స్మార్ట్ ఫోన్, గెలాక్సీ నోట్ 10.1 లకు మధ్యస్థంగా ఉండేలా గెలాక్సీ నోట్ 8.0 టాబ్లెట్ ను సాంసంగ్ రూపొందించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఈ ఉత్పత్తిని మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో సాంసంగ్ ప్రకటించింది. అయితే ఈ టాబ్లెట్ ఖరీదును సాంసంగ్ ఇంకా నిర్ణయించలేదు.