: సోనియా గాంధీ తెలుగుజాతిపై కక్ష గట్టింది: సోమిరెడ్డి
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలుగు జాతిపై కక్ష గట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకే ఆమె రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. రాహుల్ కు ప్రధాని పీఠం కోసం కేసీఆర్, జగన్ లను పావులుగా ఉపయోగించుకుంటోందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో జగన్ పార్టీ అండతో కాంగ్రెస్ లబ్ది పొందాలని చూస్తోందని దుయ్యబట్టారు.