: ఏపీఎన్జీవోలు సమ్మె చేస్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది?: పిటిషనర్లకు హైకోర్టు ప్రశ్న


ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఏపీఎన్జీవోలు సమ్మె చేస్తున్నారో లేదో తమకెలా తెలుస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సమ్మెను నిలిపివేయాలంటూ పిటిషనర్ల తరుపు న్యాయవాది వాదించగా, ప్రతిగా హైకోర్టు పైవిధంగా స్పందించింది. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, డీజీపీ, టీఎన్జీవో సంఘం, సీమాంధ్ర సెక్రటేరియేట్ ఫోరం ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News