: ఈ సాయంత్రమే ఆంటోనీ కమిటీతో టీ కాంగ్రెస్ నేతల భేటీ
విభజనపై ఇరు ప్రాంతాల నేతలు అభిప్రాయాలు చెప్పుకునేందుకు ఏర్పాటైన ఆంటోనీ కమిటీతో ఈ రోజు సాయంత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే నేతలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం ఎనిమిది గంటలకు వారు ఆంటోనీ కమిటీతో భేటీ అవుతారు.