: ఈ బీరుతో హ్యాంగోవర్ ఉండదట!
మోతాదుకు మించి తాగితే, ఈ తర్వాతి రోజు వచ్చే హ్యాంగోవర్ తలనొప్పితో కిందామీదా పడడం మందుబాబులకు బాగా అనుభవం. రమ్, విస్కీ, బ్రాందీ వంటి హాట్ డ్రింక్సే కాకుండా స్ట్రాంగ్ బీర్లు తాగినా ఈ హ్యాంగోవర్ తిప్పలు తప్పవు. ఈ హ్యాంగోవర్ ను చిత్తు చేసేలా కొంగొత్త బీరును శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా పరిశోధకులు తయారు చేసిన ఈ బీరు డీహైడ్రేషన్ ను దూరం చేసి, తద్వారా హ్యాంగోవర్ దరిచేరకుండా నిరోధిస్తుందట. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు శరీరంలోని నీటిశాతం బాగా తగ్గిపోతుంది. తద్వారా తలనొప్పి కలుగుతుంది. ఈ దిశగా పరిశోధన చేసిన గ్రిఫిత్ హెల్త్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రోలైట్స్, ఖనిజలవణాలు సమ్మిళితం చేసి కొత్త బీరును రూపొందించారు. శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచేందుకు ఈ బీరులో ఆల్కహాల్ శాతాన్ని తగ్గించారు. సో, బీరు బాబులకు నిస్సందేహంగా ఇది శుభవార్తనేమో!