: మూడో స్వర్ణం సాధించిన ఉసేన్ బోల్ట్
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ మూడో గోల్డ్ మెడల్ తో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాపియన్ షిప్ పోటీలను ముగించాడు. రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇప్పటికే 100, 200 మీటర్ల రేసుల్లో పసిడి పతకాల పంట పండించిన బోల్ట్.. నిన్న జరిగిన 400 మీటర్ల రిలేలో బంగారు పతకం సాధించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ చరిత్రలో 8 స్వర్ణాలు సాధించిన అథ్లెట్ల సరసన బోల్ట్ నిలిచాడు.