: కాళ్లకు బదులు చేతులతో నడిచి..!
రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ గుంటూరు జిల్లాలో ఉద్యోగులు వినూత్న నిరసన తెలియజేశారు. తెనాలిలోని ఆర్టీసీ బస్డాండులో ఉద్యోగులు కాళ్లకు బదులు చేతులతో నడిచారు. అటు, 122 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. 'వర్ధిల్లాలి సమైక్యాంధ్ర' అంటూ నినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు. అక్కడే క్రికెట్ ఆడారు. ఇలా ఏదో ఒక రీతిలో తమ నిరసనను తెలుపుతూ బంద్ పాటిస్తున్నారు.