: రైనా కూడా శతక్కొట్టాడు


దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరుగుతున్న నాలుగురోజుల మ్యాచ్ లో భారత్-ఎ ఆటగాళ్ళు బ్యాట్లకు చక్కగా పనిచెప్పారు. కెప్టెన్ పుజారా (137), రోహిత్ శర్మ (119)లకు తోడు సురేశ్ రైనా (135) కూడా సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాలోని రస్టెన్ బర్గ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు ఆటలో భారత్-ఎ తన తొలి ఇన్నింగ్స్ లో టాపార్డర్ రాణింపుతో 9 వికెట్ల నష్టానికి 570 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News