: 'లవ్ ఎటాక్' హీరోయిన్ అదృశ్యం
వర్ధమాన హీరోయిన్ సాయిశిరీష అదృశ్యం కావడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈమె లవ్ అటాక్ అనే చిత్రంలో కథానాయిక. యూసుఫ్ గూడలో నివాసం ఉంటున్న శిరీష మే 27న షూటింగ్ కని వెళ్ళి తిరిగి ఇంటికి చేరలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇష్టంలేని పెళ్ళి నిశ్చయం చేయడంతోనే ఆమె వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.