: భద్రత ప్రమాణాలు పాటించకనే సింధురక్షక్ ప్రమాదం: రష్యా


ముంబై తీరంలో నిలిపి ఉంచిన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి పేలుళ్ళతో నీట మునిగిపోయిన ఘటనపై రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్ స్పందించారు. ఈ రష్యా తయారీ సబ్ మెరైన్ అగ్నికి ఆహూతి కావడానికి భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. రష్యా అధికార వార్తాసంస్థ 'ఇటార్ టాస్' తో మాట్లాడుతూ, ఇటీవలే తాము ఈ కిలో క్లాస్ జలాంతర్గామిని ఓవర్ హాల్ చేసి భారత్ కు అప్పగించామని తెలిపారు. ప్రమాదానికి కారణంగా సబ్ మెరైన్ లోని యంత్ర సామగ్రి లోపమని చెప్పలేమని అన్నారు. భారత్ కూడా ఆ విధమైన సందేహాలను వ్యక్తం చేయలేదని తెలిపారు.

బ్యాటరీ చార్జింగ్ విభాగంలో ఏదైనా పేలుడు జరిగి ఉండొచ్చని, సబ్ మెరైన్లలో చార్జింగ్ అత్యంత ప్రమాదరకర ప్రక్రియ అని రోగోజిన్ వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో 18 మంది భారత నేవీ సెయిలర్లు గల్లంతు కాగా, ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు.

  • Loading...

More Telugu News