: జీఎస్ఎల్వీ డి5 కౌంట్ డౌన్ షురూ


జీఎస్ఎల్వీ డి5 రాకెట్ ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో కౌంట్ డౌన్ మొదలైంది. కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-14 ను ఈ రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈ ప్రయోగం రేపు సాయంత్రం 4.50 గంటలకు నిర్వహిస్తారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే జీఎస్ఎల్వీ డి5 రాకెట్ లో పూర్తి దేశీయంగా తయారైన క్రయోజెనిక్ ఇంజిన్ ను వినియోగిస్తున్నారు.

  • Loading...

More Telugu News