: అబ్దుల్ కలాం కల నెరవేరలేదట
'కలలు కనండి. వాటిని నిజం చేసుకోండి' అంటూ యువతలో, విద్యార్థులలో కొత్త ఊపిరిలూదిన విఖ్యాత శాస్త్రవేత, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలు అందరికీ సుపరిచితం. కానీ, అంతగా ఉత్సాహాన్నిచ్చిన కలాం కల మాత్రం నెరవేరలేదట. యుద్ధ విమాన పైలట్ కావాలన్న కలాం ఆకాంక్ష తీరలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 8 ఖాళీలకు ప్రకటన ఇస్తే కలాం 9వ స్థానంలో నిలవడంతో.. ఒక్క పాయింట్ తో అవకాశాన్ని కోల్పోయారు. కలాం తన కొత్త పుస్తకం 'కలల నుంచి వాస్తవిక ప్రపంచం'లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. యుద్ధ విమానంలో ఎంతో ఎత్తులో విహరించాలన్నది తన కలగా అందులో రాశారు.