: వీహెచ్ పై దాడి చేసిన నేతల అరెస్ట్


తిరుపతిలో వీహెచ్ కారుపై దాడి చేసిన కేసులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు బాలసుబ్రమణ్యం, రాజారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తిరుమల నుంచి తిరుపతి వస్తుండగా.. అలిపిరి సమీపంలో సమైక్యవాదుల్లో కొందరు ఆయనకు గులాబీ పూలు ఇస్తుండగా, మరికొందరు ఆయనపై చెప్పులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో వీహెచ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. 20 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఇద్దరు నేతలను అరెస్ట్ చేశారు. దీంతో వీరి అరెస్ట్ ను నిరసిస్తూ సమైక్యవాదులు అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇందులో ఎంపీ శివప్రసాద్ కూడా పాల్గొన్నారు. కాగా, తనకు టీడీపీ కార్యకర్తలు గులాబీ పూలు ఇస్తుండగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెనుక నుంచి దాడికి పాల్పడ్డారని వీహెచ్ నిన్న మధ్యాహ్నం హైదరాబాదులో మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News