: ఒత్తిడి నివారణకు కొత్త మార్గం


ఒత్తిడిని నివారించేందుకు శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మనిషి ఒత్తిడికి గురైనప్పుడు మానసికంగా కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి ఒత్తిడిని నివారించేందుకు కొత్త మార్గాలను అన్వేషించే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నులిపురుగులపై పరిశోధనలు సాగిస్తున్నారు. నులిపురుగుల్లోను, మనలోను ఒకేరకం ఎంజైము ఉన్నా నులిపురుగులు మాత్రం ఒత్తిడిని తట్టుకుంటున్నాయనీ, మనం మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక కుంగుబాటుకు గురవుతున్నామని దీనికి కారణాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

మనలో ఉండే సి-ఎలిగాన్స్‌ రకం నులిపురుగులు ఎలాంటి ఒత్తిడినైనా చక్కగా ఎదుర్కొంటాయట. అవి తీవ్ర సంక్షోభం ఎదురైనపుడు వాటి మెదడులోని సెన్సరీ కణాలు అనుసంధానమయ్యే వలయాల పరిమాణం పెరిగి అవి ఎలాంటి తీవ్ర సంక్షోభాన్నయినా తట్టుకునేలా మారిపోతాయట. మనుషులు ఒత్తిడికి గురైనపుడు మెదడులోని కణాల అనుసంధాన నిర్మాణంలో కొంతవరకూ మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ఈ మార్పు ఒత్తిడిని ఎదుర్కోవడానికి బదులు తీవ్ర కుంగుబాటును మిగులుస్తుందట. నులిపురుగులకూ మనకూ అంత తేడా ఎందుకు వచ్చింది అనే అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.

మానసికంగా కుంగుబాటు వంటి ఒత్తిడి సంబంధిత వ్యాధుల నివారణకు ఈ నులిపురుగుల మెదడు నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. వాటిని ఎక్కువ వేడి, ఎక్కువ ఆకలికి గురిచేసి వాటి మెదడు పనితీరును పరిశీలిస్తున్నారు. నులిపురుగుల్లో కేపీపీ-1 అనే ఎంజైము వాటి మెదడులో ఈ సానుకూల మార్పులకు కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే ఎంజైము మనలో ఉన్నా కూడా అది గాయాలు ఏర్పడినపుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైము ద్వారా ఒత్తిడి నివారణకు ప్రత్యేక ఔషధాలను తయారు చేసే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News