: కొత్త డీజీపీ కావాలని ప్రధానిని కోరతాం: ఎంపీ పొన్నం
డీజీపీ సీమాంధ్రకు చెందిన వాడైనందునే అక్కడ ఆందోళనలు జరుగుతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ ఈ డీజీపీని తొలగించి ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారిని నియమించాలని ప్రధానిని కోరతామన్నారు. ఓవైపు సమైక్యంగా ఉండాలని కోరుతూ, మరోవైపు తెలంగాణ వాదులపై దాడులకు పాల్పడడం సరైన పద్దతి కాదని ఎంపీ పొన్నం విమర్శించారు. నాలుగు రోజుల క్రితం ఉద్యమం ప్రారంభించి ఇప్పుడు వీహెచ్ పై దాడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దీనికి సీమాంధ్ర నాయకులు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.