: 'తెలంగాణ ఉద్యోగులకు రక్షణ కల్పించండి'


సీమాంధ్ర జిల్లాల్లో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డీజీపీ దినేష్ రెడ్డిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు కలిశారు. ఖమ్మం జిల్లా పాల్వంచ ఎక్సైజ్ సీఐపై ఓ సీమాంధ్ర సీఐ, జిల్లా ఎస్పీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తిరుపతిలో వీహెచ్ పై దాడే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. పోలీసులు సీమాంధ్రలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతూ దినేష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

  • Loading...

More Telugu News