: మా ప్రధాని అభ్యర్థి మోడీ.. బీహార్ బీజేపీ శాఖ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది. తాజాగా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించాలని బీజేపీ బీహార్ శాఖ తీర్మానించింది. బుద్ధగయలో గత రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు ఈ మేరకు తీర్మానం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నేతగా మోడీకి విశేషమైన మద్దతు లభిస్తోందని, ప్రధాని కావడానికి అంతకంటే ప్రధాన అర్హత ఇంకేం కావాలని, అందుకే తాము మోడీకి మద్దతు పలుకుతున్నామని వారు స్పష్టం చేశారు.