: పరిస్థితి చేయి దాటకముందే సమస్యను పరిష్కరించాలి: జానా రెడ్డి
తిరుపతిలో ఈ ఉదయం వీహెచ్ పై చెప్పులతో దాడి ఘటన పట్ల మంత్రి జానారెడ్డి స్పందించారు. ఆయనను సమైక్యవాదులు అడ్డుకోవడం సరికాదన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఇరుప్రాంతాల్లో ఒకరిపై ఒకరు దాడులతో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఈలోపే సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు. రెండు ప్రాంతాల్లో ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూడాలన్నారు.