: 'సమైక్యాంధ్ర కాంగ్రెస్' పేరిట కొత్త పార్టీ..?
రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా..? అంటే, అవుననే అంటున్నారు రాజమండ్రి శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు. రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే మరికొద్ది రోజుల్లో సమైక్యాంధ్ర కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ వచ్చే అవకాశముందని ఆయన హైదరాబాదులో మీడియాతో తెలిపారు. మరో రెండు వారాల్లో ఈ విషయమై స్పష్టత రావొచ్చని అన్నారు. విభజన ప్రకటనతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారిందని చెబుతూ, ఈ విషయంలో ప్రజలకు బదులివ్వలేకపోతున్నామని వాపోయారు.