: మీరు చేయలేదా దాడులు?: టీఆర్ఎస్ నేతలపై సోమిరెడ్డి ధ్వజం


సీమాంధ్రలో తెలంగాణ ప్రాంతం వారిపై దాడులు పెరిగిపోతున్నాయంటూ టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పరిరక్షణ కోసమే ఉన్నామంటూ చెప్పుకొంటున్న టీఆర్ఎస్ నేతలు.. హైదరాబాదులో టాంక్ బండ్ పై విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనను మర్చిపోయినట్టున్నారని విమర్శించారు. ఢిల్లీ ఏపీభవన్లో దళితుడైన ఓ అధికారిపై హరీశ్ రావు దాడి చేసిన విషయం ప్రజలింకా మరిచిపోలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ ఆవరణలో ఓ ఎమ్మెల్యేపై దాడి చేశారని, మరో ఎమ్మెల్సీపైనా ఇలాగే వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, తిరుపతిలో తనకు పుష్ఫ గుచ్ఛాలు ఇచ్చేందుకు వచ్చిన సమైక్యవాదులతో వీహెచ్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు. ఆయన వారిని రెచ్చగొట్టేలా మాట్లాడడంతోనే వారు ఆయన కారుపై చెప్పులతో దాడి చేశారని సోమిరెడ్డి వివరించారు. వీహెచ్ కు వయసు పెరిగిందని, తద్వారా చత్వారం కూడా వచ్చినట్టుందన్నారు. అందుకే ఆయనకు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం కనిపించి ఉండదని చమత్కరించారు.

  • Loading...

More Telugu News