: వీహెచ్ కు పుష్పగుచ్ఛాలు ఇచ్చేందుకు తరలివచ్చిన సమైక్యవాదులు


తిరుపతిలోని అలిపిరి గేట్ వద్ద రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు పుష్పగుచ్ఛాలు ఇవ్వడానికి సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. తిరుపతిలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అంశాన్ని తెరమీదికి తెచ్చింది వైఎస్సేనని అన్నారు. 2000 సంవత్సరంలో 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి విభజన కోరింది వైఎస్సేనని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులకు హైదరాబాద్ లో ఎలాంటి సమస్య ఉండదన్నారు.

  • Loading...

More Telugu News