: మంత్రి టీజీకి సమైక్యసెగ


మంత్రి టీజీ వెంకటేష్ కు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్ లో ఉన్న మంత్రి టీజీ వెంకటేష్ కార్యాలయాన్ని న్యాయవాదులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని, త్వరలోనే ఎన్నికలు రానున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని టీజీకి ఉద్యమకారులు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణం రాజీనామా చేసి ఉద్యమంలో కలవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News