: ఉల్లిపాయలు అమ్ముతున్న ఢిల్లీ సర్కారు
ప్రజాగ్రహం చవిచూసేందుకు ఏ ప్రభుత్వాలు సిద్ధపడతాయి చెప్పండి? ఢిల్లీ సర్కారూ అందుకు మినహాయింపు కాదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించే చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కొండెక్కిన ఉల్లి ధరలతో సామాన్యుడు ఇబ్బంది పడడాన్ని సీఎం షీలా దీక్షిత్ అండ్ కో సీరియస్ గా తీసుకుంది. అందుకే, నేటి నుంచి ప్రభుత్వం తరుపున చవకగా కిలో ఉల్లిపాయలను రూ.50కే అందివ్వాలని నిర్ణయించింది. ఢిల్లీ వ్యాప్తంగా 1000 కేంద్రాలను ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఉల్లిగడ్డలను విక్రయిస్తారు. అంతేగాకుండా, 150 మొబైల్ వ్యాన్ల ద్వారా కూడా ఈ అమ్మకాలు జరుపుతారు. మామూలు దుకాణాల్లో ఉల్లి కిలో ధర ప్రస్తుతం రూ.80 పలుకుతోంది.