: ప్రమాదకర ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ అరెస్ట్
ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడి 21 మందిని బలితీసుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను భారత్ - నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు రాత్రి అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. కరీమ్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో బాంబు నిపుణుడిగా పేరుగాంచాడు. ఇతడిని 2005లో కెన్యాలో అరెస్టు చేసినా, పోలీసు కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం ముమ్మర వేట సాగుతోంది.