: ఆమరణ దీక్షకు కదలిన దేవినేని ఉమ
రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందంటూ కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ నేటి నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. ఇందుకోసం విజయవాడ గొల్లపూడిలోని తన నివాసం నుంచి బందర్ రోడ్డులోని దీక్షా వేదికకు పాదయాత్రగా బయల్దేరారు. అయితే, గొల్లపూడిలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో దీక్షకంటే ముందే తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఉమ మీడియాతో అన్నారు.