: అందుకే నాకు అఫైర్లు లేవు: సోనాక్షి సిన్హా


'వంద కోట్ల' హీరోయిన్ సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఈ సుందరి క్రిష్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందే సినిమాలో నటించనుంది కూడా. అదలా ఉంచితే బాలీవుడ్ లోని టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది సోనాక్షి. అయినప్పటికీ ఎవరితోనూ అఫైర్ ఉన్నట్టు వార్తలు వెలువడలేదు. దీంతో మీడియా ఆమెను రూమర్లకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నారంటూ ప్రశ్నించింది. దానికి మీనాక్షి తాను పబ్ లకు, పార్టీ లకు వెళ్లనని, అసభ్యకరమైన పాత్రలకు దూరంగా ఉన్నానని అందుకే తనపై పుకార్లు షికార్లు చేయడం లేదని చెప్పింది. అదీ కాక తనకు ప్రైవేట్ జీవితం గడపడమే ఇష్టమని, అయినా షూటింగులకే సమయం సరిపోవడం లేదు ఇక అఫైర్లకు సమయమెక్కడుందని తిరిగి ప్రశ్నిస్తోంది.

  • Loading...

More Telugu News